Sunday, 14 August 2016

సెల్ఫీ కోసం సంపూను ఉక్కిరి బిక్కిరి చేసిన అభిమానులు






బ‌ర్నిగ్ స్టార్ సంపూబాబు సందండి చేస్తున్నాడు. కొబ్బ‌రి మ‌ట్ట‌తో మ‌రోసారి క‌డుపుబ్బ న‌వ్వించ‌డానికి ముందుకు వ‌స్తున్న ఆయ‌న‌... ఆ సినిమా కంటే ముందే... కేపీహెచ్‌బీలో ఆల‌రించారు. జేఎన్‌టీయు కి స‌మీపంలో కొత్త‌గా మీ అండ్ మ‌మ్ స్టోర్ ఓపెన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిధిగా వ‌చ్చిన సంపూ ... అక్క‌డ ఉన్న వారితో స‌ర‌దాగా గ‌డిపారు. ఆ స్టోర్‌లో చిన్న పిల్ల‌లు ఆడుకునే బెంజ్ కారు చూసి కొబ్బ‌రి మ‌ట్ట రిలీజ్ అవ‌గానే నేను కూడా బెంజ్ కారు కొనాలి అంటూ చెప్పారు. జోక్స్ వేసి అంద‌రిని అల‌రించారు. ఎంతైన సంపూ క‌దా... మ‌రి. అలాగే అక్క‌డి వ‌చ్చిన వారు సంపూతో సెల్ఫీలు దిగ‌డానికి ఎడ‌బ‌డ్డారు

Saturday, 13 August 2016

బిజీ బిజీగా మాజీ సీఎం కిర‌ణ్‌

ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు చాలా బిజీ బిజీగా మారిపోయారు. ఎంటీ ఇప్పుడు ఎన్నిక‌లు లేవు, ఏం లేవు ఆయ‌న ఏంటీ బిజీ అనుకుంటున్నారా. ఆయ‌న ఇప్పుడు ఎక్కువ‌గా బెంగుళూరులో..ఉంటున్నారు. అయితే .... స్వంత ప‌నుల‌తో పాటు ఇటు ప్ర‌జ‌ల‌కు, అభిమానుల‌కు కాస్తం టైం కూడా కేటాయిస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నాం 1 గంట‌కు బెంగుళూరు బ‌య‌లుదేరి చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి సాయంకాలం పీలేరు చేరుకుంటారు. ఇక రాత్రి న‌గిరి ప‌ల్లేలో బ‌స చేయ‌నున్నారు. ఆదివారం క‌లికిరిలోని టీటీడీ క‌ళ్యాణ మండపంలో  జ‌రిగే ఓ వివాహా వేడుక‌లో పాల్గొంటారు. అనంత‌రం తిరిగి బెంగ‌ళూరుకి వెళ్ల‌నున్నారు.


Friday, 12 August 2016

మూడు మున‌క‌లు మునిగిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్క‌రాల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైనాయి. మహాబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఇవాళ  ఉదయం గొందిమల్లలో కృష్ణా పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా పుష్కర స్నానం చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ భ‌ధ్ర‌త ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం స్నానం చేస్తున్న స‌మ‌యంలోనే సామ‌న్య ప్ర‌జ‌లు కూడా అక్క‌డ స్నానం చేయాల‌ని ఆత్రుత క‌న‌బ‌రిచారు. అయితే అది వీఐపి ఘాట్ కావ‌డంతో... వారిని అనుమ‌తించ లేదు. దీంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఆ ఘాట్ సమీపానికి కూడా రానివ్వ‌క‌పోవ‌డంతో... ఘాట్ బ‌య‌ట పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమిగుడారు. సీఎంతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా పుష్కార స్నానం చేశారు. కాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు...తాతా కేసీఆర్ వెంట న‌డుస్తూ... ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు.




అక్క‌డ స్నానం చేయ‌నున్న జ‌గ‌న్‌

యువ‌జ‌న శ్రామిక రైతు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈనెల 18న విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు.  కృష్ణా పుష్క‌రాల సంద‌ద‌ర్భంగా బెజ‌వాడ‌లో ఏర్పాటు చేసిన ఘాట్ వ‌ద్ద జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పుష్క‌ర స్నానం చేయ‌నున్నారు. అయితే ఈ శ‌నివారం రోజున జ‌న‌గ్ విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి ఉన్నా... కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. దీంతో ఈ కార్య‌క్ర‌మాన్ని గుర‌వారం వాయిదా వేశామ‌ని పార్టీ కార్యాల‌యం తెలిపింది. దీంతో బాస్ విజ‌య‌వాడ రానుడ‌డంతో అక్క‌డ పార్టీ నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


షారుఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌

బాలివుట్ న‌టుడు షారుఖాన్‌కు అమెరికాలో మ‌రోసారి చేదు అనుభ‌వం ఎదురైంది. ఇవాళ అమెరికాలోని లాస్ఎంజిల్స్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన షారుఖ్‌ను అడ్డుకున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో రెండు, మూడు సార్లు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఇప్పుడు మరోమారు లాస్ఎంజిల్స్ ఎయిర్ పోర్ట్‌లో... అధికారులు దాదాపు రెండు గంట‌ల పాటు త‌నికీలు నిర్వ‌హించారు. దీంతో షారుఖ్ ముఖంలో కోపం క‌న‌ప‌డ్డా... ఏం చేయ‌లేని పరిస్థితి. దీంతో ఖాన్ సాబ్ అస‌హనం వ్య‌క్తం చేశారు. ప‌దే ప‌దే ఇలా జ‌ర‌గ‌డంతో త‌న‌కు ఇబ్బంది క‌లుగుతుందని స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.


Thursday, 11 August 2016

పుష్కరానికి స్వాగ‌తం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కృష్ణా పుష్కారాల‌ను అట్ట‌హాసంగా ప్రారంభించారు. స‌తీస‌మేతంగా గురువారం అలంపూర్ చేరుకున్న ఆయ‌న శుక్ర‌వారం ఉద‌యం కృష్ణానదిలో శ్రాస్తోపేతంగా పుష్కార దేవుళ్లు పూజ‌లు నిర్వ‌హించారు. పుష్క‌రాల‌కు వెళ్తూ... మార్గమ‌ద్యంలో బీచ్‌ప‌ల్లిలో పుష్క‌రఘాట్‌ను త‌నిఖీ చేశారు.




మీ కోసం 

ఇయ్యాల్టి ముచ్చ‌ట‌.. మీకు కొత్త‌గా అనిపించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే వంద‌లు, వేల సంఖ్య‌లో తెలుగు బాష‌లో వెబ్‌సైట్లు, బ్లాగ్‌లు క‌న‌బ‌డుతున్నాయి. మ‌రీ  ఇన్ని ఉన్నాకా.. ఇయ్యాల్టి ముచ్చ‌ట మాకెందుకు అని అనుకుంటున్నారా... అయితే మీకు ఇందులో కొత్తద‌నం చూపించ‌డానికే ఈ బ్లాగ్ ఒపెన్ చేశాను. ఇక నుంచి అన్ని రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌, బిజినెస్ వార్త‌ల‌తో పాటు అన్ని జిల్లాల స‌మాచారాన్ని అందించ‌నున్నాను. ఇక్క‌డ కూడా మీకు ఒక సందేహం క‌ల‌గ‌వ‌చ్చు. దిన ప‌త్రిక‌లు ఉన్న త‌ర్వాత నా బ్లాగ్‌నే ఎందుకు చూడాలి అనేది మీ ప్ర‌శ్న‌. య‌స్... మీరు ఈ ప్ర‌శ్న వేయ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. ఈనాడు, సాక్షి, ఆంద్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ ఇలా చెప్పుకుంటే  పోతుంటే.. చాల‌నే ఉన్నాయి. కానీ... మీ వీధిలో ఏదైన స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు... అధికారుల‌కు చెప్పినా... స్ప‌ద‌న క‌రువైత‌ది. పోనీ దిన ప‌త్రిక‌లో వేద్దామా అంటే ఈ చిన్నా వార్త ఎలా రాయాలి అని విలేఖ‌రి అడుగుతాడు. అడుగుతారు... సో మీ స‌మ‌స్య‌లు కావాచ్చు, అవినీతి కావాచ్చు, స‌మాజం వెక్కిరించే ఏ ప‌నైనా స‌రే ...ఇంకా ఏదైన కావ‌చ్చు... సంబంధిత అధికారుల‌కు చేరే వ‌ర‌కు... ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు నా వంతు ప్ర‌య‌త్నం చేస్తాను...  
ఇట్లు
ఇయ్యాల్టి ముచ్చ‌ట‌