Friday, 12 August 2016

మూడు మున‌క‌లు మునిగిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్క‌రాల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైనాయి. మహాబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఇవాళ  ఉదయం గొందిమల్లలో కృష్ణా పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా పుష్కర స్నానం చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ భ‌ధ్ర‌త ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం స్నానం చేస్తున్న స‌మ‌యంలోనే సామ‌న్య ప్ర‌జ‌లు కూడా అక్క‌డ స్నానం చేయాల‌ని ఆత్రుత క‌న‌బ‌రిచారు. అయితే అది వీఐపి ఘాట్ కావ‌డంతో... వారిని అనుమ‌తించ లేదు. దీంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఆ ఘాట్ సమీపానికి కూడా రానివ్వ‌క‌పోవ‌డంతో... ఘాట్ బ‌య‌ట పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమిగుడారు. సీఎంతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా పుష్కార స్నానం చేశారు. కాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు...తాతా కేసీఆర్ వెంట న‌డుస్తూ... ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు.




No comments:

Post a Comment