Friday, 12 August 2016

షారుఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌

బాలివుట్ న‌టుడు షారుఖాన్‌కు అమెరికాలో మ‌రోసారి చేదు అనుభ‌వం ఎదురైంది. ఇవాళ అమెరికాలోని లాస్ఎంజిల్స్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన షారుఖ్‌ను అడ్డుకున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో రెండు, మూడు సార్లు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఇప్పుడు మరోమారు లాస్ఎంజిల్స్ ఎయిర్ పోర్ట్‌లో... అధికారులు దాదాపు రెండు గంట‌ల పాటు త‌నికీలు నిర్వ‌హించారు. దీంతో షారుఖ్ ముఖంలో కోపం క‌న‌ప‌డ్డా... ఏం చేయ‌లేని పరిస్థితి. దీంతో ఖాన్ సాబ్ అస‌హనం వ్య‌క్తం చేశారు. ప‌దే ప‌దే ఇలా జ‌ర‌గ‌డంతో త‌న‌కు ఇబ్బంది క‌లుగుతుందని స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.


No comments:

Post a Comment