Thursday, 11 August 2016

మీ కోసం 

ఇయ్యాల్టి ముచ్చ‌ట‌.. మీకు కొత్త‌గా అనిపించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే వంద‌లు, వేల సంఖ్య‌లో తెలుగు బాష‌లో వెబ్‌సైట్లు, బ్లాగ్‌లు క‌న‌బ‌డుతున్నాయి. మ‌రీ  ఇన్ని ఉన్నాకా.. ఇయ్యాల్టి ముచ్చ‌ట మాకెందుకు అని అనుకుంటున్నారా... అయితే మీకు ఇందులో కొత్తద‌నం చూపించ‌డానికే ఈ బ్లాగ్ ఒపెన్ చేశాను. ఇక నుంచి అన్ని రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌, బిజినెస్ వార్త‌ల‌తో పాటు అన్ని జిల్లాల స‌మాచారాన్ని అందించ‌నున్నాను. ఇక్క‌డ కూడా మీకు ఒక సందేహం క‌ల‌గ‌వ‌చ్చు. దిన ప‌త్రిక‌లు ఉన్న త‌ర్వాత నా బ్లాగ్‌నే ఎందుకు చూడాలి అనేది మీ ప్ర‌శ్న‌. య‌స్... మీరు ఈ ప్ర‌శ్న వేయ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. ఈనాడు, సాక్షి, ఆంద్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ ఇలా చెప్పుకుంటే  పోతుంటే.. చాల‌నే ఉన్నాయి. కానీ... మీ వీధిలో ఏదైన స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు... అధికారుల‌కు చెప్పినా... స్ప‌ద‌న క‌రువైత‌ది. పోనీ దిన ప‌త్రిక‌లో వేద్దామా అంటే ఈ చిన్నా వార్త ఎలా రాయాలి అని విలేఖ‌రి అడుగుతాడు. అడుగుతారు... సో మీ స‌మ‌స్య‌లు కావాచ్చు, అవినీతి కావాచ్చు, స‌మాజం వెక్కిరించే ఏ ప‌నైనా స‌రే ...ఇంకా ఏదైన కావ‌చ్చు... సంబంధిత అధికారుల‌కు చేరే వ‌ర‌కు... ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు నా వంతు ప్ర‌య‌త్నం చేస్తాను...  
ఇట్లు
ఇయ్యాల్టి ముచ్చ‌ట‌

No comments:

Post a Comment